Wednesday, 30 September 2026

మురుకంబట్టులో 600 గ్రాముల గంజాయి పట్టివేత – ఇద్దరు ముద్దాయిల అరెస్ట్.

మురుకంబట్టులో 600 గ్రాముల గంజాయి పట్టివేత – ఇద్దరు ముద్దాయిల అరెస్ట్.


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

చిత్తూరు జిల్లా ఎస్పీ  తుషార్ డూడి,  ఆదేశాల  మేరకు, చిత్తూరు SDPO  వెంకట నారాయణ  సూచనలతో, చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ సీఐ  K. రామచంద్ర  పర్యవేక్షణలో చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్సై  అశోక్ కుమార్ మరియు సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు చేపట్టారు.


ఈ క్రమంలో ఈరోజు మురుకంబట్టు ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న వేలూరుకు చెందిన జై కుమార్ మరియు మహమ్మద్ అలీలను అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు.


తనిఖీల్లో వారి వద్ద సుమారు 600 గ్రాముల గంజాయి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.


చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయించడం, రవాణా చేయడం లేదా సేవించడం, అక్రమంగా మద్యం విక్రయించడం, పేకాట నిర్వహించడం లేదా ఆడటం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, సేవనం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించినట్లయితే వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

No comments:

Post a Comment