Wednesday, 16 September 2026

తాగునీటి పథకాల పనులను వేగవంతం చేయాలి

తాగునీటి పథకాల పనులను వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్



చిత్తూరు, సెప్టెంబర్,16 ఫస్ట్ న్యూస్ 4 యు 

జిల్లాలో జల్ జీవన్ మిషన్ (JJM) కింద మంజూరైన అన్ని రకాల తాగునీటి సరఫరా పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

అధికారులను ఆదేశించారు. బుధవారం  కలెక్టర్ క్యాంపు నుండి Zoom కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా నీరు మరియు పారిశుద్ధ్య మిషన్ (DWSM) కమిటీ సమావేశం నందు కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షితమైన పైపులైన్ తాగునీరు అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.


నీటి ఎద్దడి ఏర్పడే ప్రాంతాల్లో ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాల్లో బోర్‌వెల్‌ల లోతు పెంపు, శుభ్రపరిచే పనులు, పంపుసెట్లు, పంపింగ్ మెయిన్లు, విద్యుత్ సరఫరా, జీఐ పైపుల ఏర్పాటు వంటి పనులను ప్రాధాన్యతతో చేపట్టాలని తెలిపారు.


గడువులోగా పనులు పూర్తి: మంజూరైన సింగిల్ విలేజ్ మరియు మల్టీ విలేజ్ స్కీముల పనులలో ఎక్కడా జాప్యం జరగకూడదు.


నాణ్యతా ప్రమాణాలు: తాగునీటి పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి.


సమన్వయం: గ్రామీణ నీటి సరఫరా (RWS), పంచాయతీరాజ్, మరియు రెవెన్యూ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భూసేకరణ లేదా ఇతర అంతరాయాలను వెంటనే అధిగమించాలి.

నిధుల సద్వినియోగం: కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగిస్తూ, పనులు పూర్తయిన వాటికి వెంటనే బిల్లుల ప్రక్రియ పూర్తి చేయాలి.


లాగ్‌లో ఉన్న లేదా వెనుకబడిన గ్రామాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి పనులను పరుగులు పెట్టించాలని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.


త్రాగునీరు అందుబాటులో లేని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, ట్యాంకర్ ట్రిప్పుల వివరాలను ఆఫ్‌లైన్‌లో నమోదు చేసి, నీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.


గ్రామస్థాయిలో Village Water & Sanitation Committees (VWSC)/పాని సమితులు క్రియాశీలకంగా పనిచేసేలా చూడాలని, ప్రతి నెల సమావేశాలు నిర్వహించి సమావేశపు మినిట్స్‌ను e-Gram Swarajలో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా, పారిశుధ్యం, నీటి నాణ్యతకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి సంబంధిత శాఖల సమన్వయంతో తక్షణ పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్ సీఈఓ,  రవికుమార్ నాయుడు, జిల్లా పంచాయతీ అధికారి, K. సుధాకర్ రావు, PD–DWMA, ఏ రవికుమార్, DM&HO, నాగ శశిభూషణ రెడ్డి, RWS SE K. విజయ కుమార్, PD–ICDS , వెంకటేశ్వరి, DEO, లక్ష్మీనారాయణ,  జల వనరుల శాఖ అధికారి పి విజయ్ కుమార్ రెడ్డి,SE–APSPDCL, అమీర్ బాబు,  తదితర అధికారులు పాల్గొన్నారు.









No comments:

Post a Comment