Saturday, 12 September 2026

కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారు తల్లి ... బొంతల గంగమ్మ తల్లి...

కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారు తల్లి ... బొంతల గంగమ్మ తల్లి...

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 



 కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారు తల్లి ... బొంతల గంగమ్మ తల్లి... సంతానం కావాలన్నా ఉద్యోగం కావాలన్నా కుటుంబ సమస్యలు తొలగాలన్న, కష్టాలు తీరాలన్న బొంతల గంగమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి ఒక్క మొక్కు మొక్కుకుంటే చాలు... మీ కోరికలను బొంతల గంగమ్మ తల్లి తీరుస్తారు... 

ఇంతకీ బొంతల గంగమ్మ తల్లి ఆలయం ఎక్కడ ఉంది ?

ఎవరు కట్టించారు ? ఆలయం యొక్క చరిత్ర ఏమిటి? బొంతల గంగమ్మ తల్లిని నమ్ముకున్న వారికి జరిగిన సంఘటనలు ఏమిటి ? ఇలాంటి పూర్తి విశేషాలు మీ కోసం..... మీ సమస్యల పరిష్కారం కోసం బొంతల గంగమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించండి.. తల్లి కృపకు పాత్రులుకండి...



చిత్తూరు నుండి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో కాణిపాకం అగరమాంగళం నుండి ఒక కిలోమీటర్ దూరంలో చిగరపల్లి లో 150 ఏళ్ళ క్రితం ఒక చెట్టు కింద బొంతల గంగమ్మ తల్లి స్వయంభుగా వెలిశారు. అక్కడి గ్రామస్తులు బొంతల గంగమ్మ తల్లిని తమ ఆరాధ్య దైవంగా గ్రామ దేవతగా కొలిచేవారు. అదే గ్రామానికి చెందిన... బాలకృష్ణ వంశీయులు, అతని కుమారులైన బాబు సన్స్  బొంతల గంగమ్మ తల్లి చెట్టు కింద ఉండగా రోడ్డు విస్తరణలో భాగంగా ఆ తల్లి విగ్రహాన్ని ఆ చెట్టుకు ఎదురుగా ఉన్న  స్థలంలో ప్రతిష్టాపించి సొంత నిధులతో ఆలయాన్ని నిర్మించారు. 



శబరిమలై కి వెళ్లే భక్తులు నడకదారిలో అమ్మవారిని దర్శించుకుని అనంతరం కానిపాకానికి వెళ్తూ ఉంటారు. కాణిపాకం దర్శించుకుని నడకదారిలో తిరుమల కు వెళ్లే భక్తులు బొంతల గంగమ్మ తల్లిని దర్శించుకుని అనంతరం తిరుమలకు వెళుతూ ఉంటారు. భక్తులు కావలసిన అన్ని రకాలైన సౌకర్యాలను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.  తరతరాలుగా ఆ బొంతల గంగమ్మ తల్లిని నమ్ముకుని ప్రతి మంగళవారం శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆ ఆలయాన్ని సందర్శించి పెళ్లి కావాలి ఉద్యోగం కావాలి సంతానం కావాలి అని కోరుకున్న భక్తులకు కొంగు బంగారమై బొంతల గంగమ్మ తల్లి వారి కోర్కెలను తీర్చడంతో, భక్తులు సంతృప్తి చెంది వారి శక్తి మేరకు కానుకల రూపంలో ఆలయ అభివృద్ధికి పూనుకున్నారు. అమ్మవారిని సంతోషించండి ఆమె కటాక్షానికి పాత్రులుకండి.



No comments:

Post a Comment