Friday, 25 September 2026

27 న జిల్లాస్థాయి అండర్ - 18 జూనియర్ ఖో ఖో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు

 

27 న జిల్లాస్థాయి అండర్ - 18 జూనియర్ ఖో ఖో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు 

- జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ , కార్యదర్శి బాలాజీ 





ఈనెల 27వ తేదీ ఆదివారం చిత్తూరు మెకానికల్ గ్రౌండ్లో మధ్యాహ్నం 3 గంటలకు చిత్తూరు జిల్లా బాలబాలికల అండర్ -18 జూనియర్స్ ఖో ఖో జిల్లాస్థాయి జట్ల ఎంపిక పోటీలు నిర్వహించబడునని చిత్తూరు ఖో ఖో సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ కార్యదర్శి బాలాజీ  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎంపిక పోటీలకు 1.12.2008 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులు అన్నారు. ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు తప్పనిసరిగా పదవ తరగతి మార్క్ మెమోలు, ఆధార్ కార్డులను వెంట తీసుకుని రావాలన్నారు. క్రీడాకారుల వయస్సు ,బరువు , ఎత్తు 3 కలిపి 250 పాయింట్లు లోపల ఉండాలన్నారు. ఈ పోటీలలో ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్ 16 నుండి 18 వరకు ఉమ్మడి కృష్ణాజిల్లా కంచికర్లలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఇతర వివరాలకు 7013046094 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

No comments:

Post a Comment