ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడిని రెండు గంటల్లో డ్రోన్ సాయంతో గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన గుడుపల్లి పోలీసులు.
సకాలంలో స్పందించి అధునాతన డ్రోన్ టెక్నాలజీతో బాలుడిని సురక్షితంగా గుర్తించిన పోలీసులు – అభినందించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి
గుడుపల్లి మండలం నలగంపల్లి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి యొక్క 12 సంవత్సరాల కుమారుడు కుటుంబ సభ్యులతో గొడవపడి ఈ రోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. బాలుడు ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి వెంటనే గుడుపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీ శ్రీనివాసులు సంప్రదించి ఫిర్యాదు చేశారు.
విషయం తెలుసుకున్న వెంటనే ఎస్ఐ శ్రీ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి బాలుడి ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల డేగగా ఉపయోగిస్తున్న అధునాతన డ్రోన్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.
పోలీసుల సకాలంలో స్పందన, సమన్వయంతో చేపట్టిన గాలింపు చర్యల ఫలితంగా కేవలం రెండు గంటల్లోనే బాలుడిని గుర్తించి, క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.
తమ కుమారుడిని సురక్షితంగా గుర్తించి తమకు అప్పగించినందుకు బాలుడి తల్లిదండ్రులు గుడుపల్లి పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల తక్షణ స్పందన, డ్రోన్ టెక్నాలజీ వినియోగం పట్ల వారు ప్రత్యేకంగా అభినందనలు వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు గుడుపల్లి ఎస్ఐ శ్రీ శ్రీనివాసులు మరియు పోలీసు సిబ్బందిని అభినందించారు.

No comments:
Post a Comment