*చిత్తూరు జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు మరియు పోలీసు కుటుంబాలకు వినాయక చవితి శుభాకాంక్షలు – జిల్లా ఎస్పీ తుషార్ డూడి
*"విఘ్నాలు తొలిగి విజయాలు చేకూరాలని ఆకాంక్ష"*
*"పర్యావరణ అనుకూల వినాయకుడు... మన భవిష్యత్తుకు రక్షకుడు!"*
*"మన ఆధ్యాత్మికతను మరింత పవిత్రంగా చేస్తూ, ఈ వినాయక చవితిని శాంతియుతంగా జరుపుకుందాం."*
సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం జరుపుకోనున్న వినాయక చవితి పర్వదినం సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "విఘ్నేశ్వరుడి కృపతో ప్రజల జీవితాల్లోని అన్ని విఘ్నాలు తొలగిపోయి, విజయాలు, సంతోషాలు, సమృద్ధి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను" అని అన్నారు.
భారతీయ సంస్కృతిలో వినాయక చవితి సామరస్యానికి, ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ, వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలు వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకోవాలని, గణేష్ నిమజ్జన కార్యక్రమాలను శాంతియుతంగా, పోలీసుల సూచనలు మరియు నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని సూచించారు.
జిల్లాలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, అభివృద్ధిలో ముందడుగు వేయాలని, విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ విజయవంతమైన జీవితాన్ని గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు.
*వినాయక మండపాల నిర్వాహకులు ఎటువంటి శాంతిభద్రతలకు, మతపరమైన సంఘర్షణలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినా, లేదా జరిగే అవకాశం ఉన్నా వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు, 112కు లేదా చిత్తూరు పోలీస్ WhatsApp: 9440900005కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు సూచించారు.*

No comments:
Post a Comment