స్థానిక ఎన్నికల శంఖారావం మోగనుంది!
కానీ ఇంతవరకు ఖరారు కానీ రిజర్వేషన్లు
డివిజన్ల పునర్విభజనతో వేడెక్కిన వాతావరణం
ఎన్నికల సెగ నగరంలో మొదలైందా ?
మేయర్ కుర్చీ కోసం.. ప్రజల మధ్యకు నాయకులు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో , అధికార పార్టీ అభ్యర్థుల ఖరారులో శతమతం అవుతుంది. ఒకపక్క వైసీపీ నాయకులు ఖచ్చితంగా అన్ని స్థానాల్లో పోటీ చేయాలని ఏకగ్రీవం ఎక్కడ జరగకూడదని అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్.. అధికార పార్టీని మరింత అప్రమత్తం చేసిందా ? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు కూటమి నాయకులలో టిడిపి నాయకులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే జనసేన బిజెపి నాయకులకు చాలా తక్కువ స్థాయిలో అధికారాలు కట్టబెట్టారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. టిడిపిలో వర్గ పోరు మొదలైంది అని కూటమి నేతల నోటే వినిపిస్తోంది. ఇక చిత్తూరు నగరానికి సంబంధించి మేయర్ పదవికి అటు అధికార పార్టీ నుండి ఇటు ప్రతిపక్ష పార్టీ నుండే కాకుండా, వామపక్షాలు సైతం అన్ని డివిజన్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
మేయర్ పదవి కోసం కూటమి నాయకుల పోటీ
చిత్తూరు నగరానికి సంబంధించి మేయర్ కుర్చీ కోసం కూటమి నేతల్లో చాలామంది ఆశావాహులు ఉన్నారు . ఇందులో ప్రస్తుతం బహిరంగంగా పలువురి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. చుడా చైర్ పర్సన్ కటారి హేమలత తనకు నామినేటెడ్ పదవి ఇచ్చినప్పటికీ, గతంలో ఆమె మేయర్గా పనిచేయడంతో ఆ అనుభవం ఉండడంతో మళ్లీ ఆమె మేయర్ పదవికి పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే నేపథ్యంలో టిడిపి పార్టీలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తూ , ఇటీవల చిత్తూరు ఎమ్మెల్యే తో మరింత సన్నిహితంగా ప్రజల్లోకి వస్తున్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాజూరు బాలాజీ మేయర్ పదవి కోసం నాయకులను ప్రసంగ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సతీమణి సీకే లావణ్య బాబు కూడా ఎన్నికల బరిలో ఉన్నట్లు సమాచారం. రియల్ ఎస్టేటర్ ఎల్బీ లోకేష్ కూడా పదవి కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నారని టిడిపి వర్గాల సమాచారం. ఇటీవల మరణించిన దివంగత మాజీ కార్పొరేటర్ వసంత్ కుమార్ భార్య చెరుకూరి శిల్ప ప్రస్తావని కూడా ప్రజల మధ్య నానుతోంది. మేయర్ గా శిల్ప పేరును అధికార పార్టీ అధిష్టానం ప్రకటించిన, అందుకు ఆమె ఒప్పుకున్నా తప్పనిసరిగా శిల్ప పేరు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వసంత్ కుమార్ అజాతశత్రువుగా ఎదిగారు. కాబట్టి వైసిపి పార్టీ కూడా శిల్ప పేరును ప్రకటిస్తే ఏకగ్రీవానికి అంగీకరించే అవకాశాలు మొండు గా కనిపిస్తుంది.
వైసిపి పార్టీ నుండి మాజీ కార్పొరేటర్ హరిణి రెడ్డి, రాహుల్ రాజారెడ్డి గట్టిగా మేయర్ పదవి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటే , మరోపక్క చిత్తూరు వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్ విజయానంద్ రెడ్డి సతీమణి ఇందుమతి పేరు తెరపైకి వస్తోంది.
కూటమి నేతల్లో కలవరం
ఎన్నికల్లో టిడిపి పార్టీ గెలవడానికి అత్యంత కీలక పాత్ర పోషించిన కూటమి నేతల్లో ఇప్పుడు స్థానిక ఎన్నికల గురించి కలవరం మొదలైంది. ఎన్నికల అనంతరం అధికార పార్టీ టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతలైన బిజెపి జనసేన నాయకులకు నామినేటెడ్ పదవుల్లో గాని ఇతర చిన్నచితకా పదవుల్లో గాని చాలా తక్కువ శాతం సీట్లను కేటాయించడంతో కూటమినేతల్లో అసంతృప్తి మొదలైంది. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన వ్యక్తికి మేయర్ పదవి ఇవ్వాలంటూ రాష్ట్ర అధిష్టానం దృష్టికి కూటమి నేతలు తీసుకెళ్లినట్లు సమాచారం.
గత వైసిపి ప్రభుత్వం లో మేయర్గా ఎన్నికై అనంతరం టిడిపి పార్టీలో చేరిన ఆముద ఎస్సీ రిజర్వేషన్ వస్తే ఆమె కూడా పోటీలోకి దిగుతున్నట్లు సమాచారం.
ఇంతవరకు ఖరారు కానీ రిజర్వేషన్లు !
చిత్తూరు నగరంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఏ కులాన్ని భావిస్తుందా అని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. కానీ రిజర్వేషన్లను పక్కనపెట్టి ఇప్పటికే ఓసి, బిసి, ఎస్సి, ఎస్టీ అన్ని కులాలకు చెందిన నాయకులు మేయర్ పదవి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. చిత్తూరు నగరంలో సుమారు నాలుగు లక్షలకు పైగా జనాభా ఉండగా, అందులో ఓటర్ల సంఖ్య 2.75 లక్షలకు పైగా ఉన్నట్లు సమాచారం. ఇందులో 33,000 మంది వన్నెకుల క్షత్రియులు ఉండడంతో, చిత్తూరు తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావడంతో అధిక సంఖ్యలో తమిళ్లే ఓటర్లుగా ఉన్న నేపథ్యంలో వన్నీయ కుల క్షత్రియలకు మేయర్ పదవి ఇవ్వాలంటూ ఆ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
మేయర్ పదవికి సంబంధించి ఇప్పటికే నగరంలో ఎన్నికల నేపథ్యంలో వాతావరణం వేడెక్కింది. వచ్చే నెలలో దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలుకానున్న అనే పద్యంలో ఎవరికి వారు తమకే పదవి కావాలంటూ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరి ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు? రిజర్వేషన్ ఎవరికి వస్తుంది? ఎవరు మేయర్గా గెలవనున్నారు ? అన్న అంశాలు వేచి చూడాల్సిందే మరి.

No comments:
Post a Comment