అక్టోబర్ 31 నవంబర్ 1వ తేదీల్లో చిత్తూరు లో జరిగే ఏ.పీ.అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స అసోసియేషన్ రాష్ట్ర 8 వ మహాసభలను జయప్రదం చేయండి
ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు
రావులపల్లి రవీంద్రనాథ్ పిలుపు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
ఏ.పీ. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ అనుబంధం జిల్లా సమితి సమావేశం ఎస్ టి యు కార్యాలయంలో కే. ప్రభావతి అధ్యక్షతన జరిగింది
సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్.రవీంద్రనాథ్,ఏ.పీ.అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే. లలిత లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అతి తక్కువ వేతనంతో అంగన్వాడీ వర్కర్ల వద్ద హెల్పర్ల వద్ద పని చేయించుకుంటూ శ్రమ దోపిడీని చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు
ఐదు దశాబ్దాల నుండి గ్రామీణ పట్టణ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన గర్భిణీలకు బాలింతలకు 0 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు అనేక సేవలు అందిస్తున్న కనీసం ఉద్యోగ భద్రత కూడా కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడం అన్యాయం అన్నారు అనేక యాపులు తెచ్చి అంగన్వాడీలకు పని భారం పెంచారని వాపోయారు అంగన్వాడి కేంద్రాలను
బలోపేతం చేయడానికి సరిపోవు నిధులు కేటాయించకుండా లబ్ధిదారులకు నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నారని కొత్తగా గర్భిణీ బాలింతలకు ఫేస్ యాప్ తీసుకొచ్చారు ఫోన్లు పని చేయకపోయినా నెట్ సిగ్నల్ లేకపోయినా పనులు చేయాలని అధికారులు అంగన్వాడీలను మానసికంగా వేధించడాన్ని మానుకోవాలన్నారు గత 50 సంవత్సరాలుగా అతి తక్కువ జీతంతో పనిచేస్తున్న అంగన్వాడి వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు
జీతాల పెంపు, గ్రాటివిటీ రకరకాల యాపులు వంటి సమస్యలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని వాటిని సాధించడానికి ఐక్య పోరాటాలు అవసరమని అంగన్వాడీ వర్కర్లకు తెలిపారు ఇతర రాష్ట్రాల్లో అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న రాయితీలను మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అనుబంధం అసోసియేషన్ ఏఐటియుసి అనుబంధం సంఘం రాష్ట్ర ఎనిమిదవ మహాసభలు చిత్తూరులో అక్టోబర్ 31 నవంబర్ 1వ తేదీన జరపనున్నట్లు నాయకులు తెలిపారు చిత్తూరులో జరిగే మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని పోరాటానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు
సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ.పీ. మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గిరి ఏఐటియుసి చిత్తూరు జిల్లా బాధ్యులు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాధాకృష్ణ,ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్. నాగరాజు,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వి సి గోపినాథ్,ఏ.పీ. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.ప్రేమ,జిల్లా అధ్యక్షులు కే.ప్రభావతి జిల్లాలోని ప్రాజెక్టు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు


No comments:
Post a Comment