Friday, 25 September 2026

రెండు ద్విచక్ర వాహనాల దొంగతనంపై కేసు నమోదు బంగారుపాళ్యం సిఐ కత్తి శ్రీనివాసులు

 రెండు ద్విచక్ర వాహనాల దొంగతనంపై కేసు నమోదు 

బంగారుపాళ్యం సిఐ కత్తి శ్రీనివాసులు 


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు : 

రెండు ద్విచక్ర వాహనాలు దొంగతనం పైన ఈ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంగారుపాళ్యం సిఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. ఆయన కథనం మేరకు ఈనెల 23వ తేదీన పలమనేరుకు చెందిన రమేష్ అతని భార్య ప్రమీల  బంగారుపాళ్యం నేషనల్ హైవే లోని రవి డాబా లో బయట స్కూటీ పార్కింగ్ చేసి వెళ్లి వచ్చి చూడగా స్కూటీ దొంగతనానికి గురైనట్లు నిర్ధారించుకొని బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈనెల 24వ తేదీన నేషనల్ హైవే లోని ఎద్దుల వారి పల్లి వద్ద ఉన్న శ్రీహరి హోటల్ ముందు హోటల్ యజమాని సీనయ్య తన బైక్ను పార్కింగ్ చేసి ఉంచగా దొంగతనానికి గురైనట్లు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

No comments:

Post a Comment