అక్టోబర్ 31 నవంబర్ 1వ తేదీల్లో చిత్తూరు లో జరిగే ఏ.పీ.అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స అసోసియేషన్ రాష్ట్ర 8 వ మహాసభలు జయప్రదం చేయండి
- ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కర్రపత్రాలు విడుదల
ఏ.పీ. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ అనుబంధం యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అంగన్వాడి రాష్ట్ర 8వ మహాసభల కరపత్రాలను విడుదల చేశారు
ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు విసి గోపీనాథ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కే ప్రభావతి జిల్లా కార్యదర్శి కె.ప్రేమ లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అతి తక్కువ వేతనంతో అంగన్వాడీ వర్కర్ల వద్ద హెల్పర్ల వద్ద పని చేయించుకుంటూ శ్రమ దోపిడీని చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు
ఐదు దశాబ్దాల నుండి గ్రామీణ పట్టణ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన గర్భిణీలకు బాలింతలకు 0 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు అనేక సేవలు అందిస్తున్న కనీసం ఉద్యోగ భద్రత కూడా కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడం అన్యాయం అన్నారు అనేక యాపులు తెచ్చి అంగన్వాడీలకు పని భారం పెంచారని వాపోయారు అంగన్వాడి కేంద్రాలను
బలోపేతం చేయడానికి సరిపోవు నిధులు కేటాయించకుండా లబ్ధిదారులకు నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నారని కొత్తగా గర్భిణీ బాలింతలకు ఫేస్ యాప్ తీసుకొచ్చారు ఫోన్లు పని చేయకపోయినా నెట్ సిగ్నల్ లేకపోయినా పనులు చేయాలని అధికారులు అంగన్వాడీలను మానసికంగా వేధించడాన్ని మానుకోవాలన్నారు గత 50 సంవత్సరాలుగా అతి తక్కువ జీతంతో పనిచేస్తున్న అంగన్వాడి వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు
జీతాల పెంపు, గ్రాటివిటీ రకరకాల యాపులు వంటి సమస్యలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని వాటిని సాధించడానికి ఐక్య పోరాటాలు అవసరమని అంగన్వాడీ వర్కర్లకు తెలిపారు ఇతర రాష్ట్రాల్లో అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న రాయితీలను మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అనుబంధం అసోసియేషన్ ఏఐటియుసి అనుబంధం సంఘం రాష్ట్ర ఎనిమిదవ మహాసభలు చిత్తూరులో అక్టోబర్ 31 నవంబర్ 1వ తేదీన జరపనున్నట్లు నాయకులు తెలిపారు చిత్తూరులో జరిగే మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని పోరాటానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు
సమావేశంలో ఏఐటియుసి నాయకులు కే.మణి,దాసరి చంద్ర,కే.రమాదేవి,రఘు, బాలాజీ రావు తో పాటు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు అరుణ, ఫరీదా, భాగ్యలక్ష్మి, కాంచన, విజయ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment