Wednesday, 16 September 2026

తిరుపతిలో ఘనంగా సత్య అన్న జన్మదిన వేడుకలు

 తిరుపతిలో ఘనంగా  సత్య అన్న జన్మదిన వేడుకలు


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 


తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా వారి అనుచరులు రూపేష్ కుమార్ యాదవ్  గారి ఆధ్వర్యంలో 500 మంది రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల  సురేష్ గారు మాట్లాడుతూ సత్య  కుమార్ యాదవ్ గారికి జన్మదిన సందర్భంగా యువ నాయకులు రూపేష్ కుమార్ యాదవ్ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు


ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గారు ,రుయా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ మనోహర్ గారు ,

బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

No comments:

Post a Comment