రాజకీయం చేయడానికి రాలేదు
అభివృద్ధి చేయడానికి వచ్చాను
- ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
రాజకీయం చేయడానికి రాలేదు అభివృద్ధి చేయడానికి వచ్చాను అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలోని 50వ డివిజన్ చవటపల్లిలో టిడిపి ఇన్చార్జ్ భాను ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక మండపాన్ని ఆయన సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పలుచోట్ల బంక మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కానీ శ్రీనివాస కళ్యాణం కార్యక్రమం జరిగిన రోజు తనపైన వైసీపీ నాయకుడు విమర్శలు చేయడం నీచ రాజకీయాలకు నిదర్శనం అన్నారు. చిత్తూరులో ఇలాంటి విజ్ఞాలు తొలగాలంటే విజ్ఞాలను తొలగించే వినాయకుడి వల్లే సాధ్యమన్నారు. చిత్తూరు అభివృద్ధిని కోరుకుని చిత్తూరు వాసిగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచానని, రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు కూడా తమ వార్డులో ఎవరైతే అభివృద్ధి చేపడుతారో వారిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి పలు అంశాలు తీసుకువెళ్లాలని ఇప్పటికే నగర అభివృద్ధిలో భాగంగా 110 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. ఇందులో 46 కోట్లు రోడ్ల విస్తరణకు 80 కోట్లు కాల్వలు కట్టడానికి, నగర అభివృద్ధికి కేటాయించడం జరిగిందన్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు మరో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నందున తర్వాత వచ్చి ప్రతి వార్డులో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. తన పైన ఎంతమంది నీచ రాజకీయాలు చేసిన విమర్శలు చేసిన తాను చిత్తూరు అభివృద్ధి ఆకాంక్షించే వాడినని, విమర్శలకు భయపడే రకం కాదని స్పష్టం చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి వైపు ప్రజలు నిలబడతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

No comments:
Post a Comment