Wednesday, 16 September 2026

21, 22 తేదీల్లో సీఎం కుప్పం పర్యటన

*ముఖ్యమంత్రి కుప్పం పర్యటన విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి*

సెప్టెంబర్ 21,22, తేదీలలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన 

ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్



చిత్తూరు, సెప్టెంబర్ 16 ఫస్ట్ న్యూస్ 4 యు: 

     రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 21వ తేదీ నుండి 22వ తేదీ వరకు కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించనున్న నేపథ్యంలో, ముందస్తు ఏర్పాట్లు భాగంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (KADA) పీడీ వికాస్ మర్మత్‌తో కలిసి బుధవారం పర్యటనకు సంబంధించిన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. తుంసి హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు. కుప్పం కొత్తపేటలో ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయాల నిర్మాణ స్థలాన్ని, సీఎం సభా వేదికను, కుప్పం బైపాస్ రోడ్డులోని రాజు కాలనీ సర్కిల్ వద్ద రైతు బజార్ ఏర్పాటు స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లలో భాగంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి బహిరంగ సభలు, గ్యాలరీలు ఏర్పాటు , ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన లబ్ధిదారులు ముఖ్యమంత్రి గారు ముచ్చటిస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లబ్ధి పొందిన, HSSN లబ్ధి పొందిన రైతు, సంజీవని ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు , మహిళ పారిశ్రామికవేత్త, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన లబ్ధి పొందిన లబ్ధిదారులు సంబంధిత శాఖ అధికారులు త్వరితగతిన అర్హుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు, వివిధ సంక్షేమ పథకాలలో లబ్ధి పొందిన లబ్ధిదారులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు, బహిరంగ సభ ఉంటుందని తెలిపారు, శుక్రవారం నుండి సంబంధిత అధికారులు కుప్పంలో మీకు కేటాయించిన విధులలో జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.

హెలిప్యాడ్, వేదికలు, రహదారులు, అతిథి గృహాలు తదితర అన్ని ఏర్పాట్లను నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, వైద్య సేవలు, పార్కింగ్, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో  ఏఎస్పీ హేమంత్ బొడ్డు, డాక్టర్ సురేష్ బాబు, సీఎం వ్యక్తిగత కార్యదర్శి శ్రీకాంత్, ఆర్డీవో మహమ్మద్ హుస్సేన్, కమిషనర్ శ్రీనివాసరావు, తహసీల్దార్ రమేష్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు. 


No comments:

Post a Comment