చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కు
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం..
వేద పండితుల చేత ఆశీర్వచనాలు
ఆహ్వాన పత్రిక అందించిన చైర్మన్ మణి నాయుడు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ను ఆహ్వానించారు. శుక్రవారం కాణిపాకం దేవస్థానం పాలకమండలి చైర్మన్ మణి నాయుడు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి బ్రహ్మోత్సవ పత్రికను అందించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు వేద మంత్రోచ్ఛారణతో శేష వస్త్రాలు కప్పి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ను ఆశీర్వదించారు. తీర్థ ప్రసాదాలు అందించారు.


No comments:
Post a Comment