Thursday, 17 September 2026

సృష్టికి ఆద్యుడు.. శిల్పకళకు ఆచార్యుడు శ్రీ విరాట్ విశ్వకర్మ

• సృష్టికి ఆద్యుడు.. శిల్పకళకు ఆచార్యుడు శ్రీ విరాట్ విశ్వకర్మ
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద రావు

• ఘనంగా జరిగిన రాష్ట్ర పండుగ శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు  
• వృత్తి నైపుణ్యమే సమాజ ప్రగతికి పునాది

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్




చిత్తూరు, సెప్టెంబర్, 17 చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:

     సమాజ నిర్మాణంలో నైపుణ్యం కలిగిన వృత్తిదారులు, శిల్పులు, కార్మికుల పాత్ర అత్యంత కీలకమని, వారి శ్రమ, నైపుణ్యం, సృజనాత్మకతకు సమాజంలో ఎల్లప్పుడూ విశిష్టమైన గౌరవం ఉంటుందని చిత్తూరు ఎంపీదగ్గుమళ్ళ ప్రసాద రావు పేర్కొన్నారు. శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.  గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో




  జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వెడుకలను జ్యొతి ప్రజ్వలన చెసి ప్రారంభించి,  శ్రీ విరాట్ విశ్వకర్మ  చిత్రపటానికి పూలమాలు వెసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, DRO K.మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా  MP మాట్లాడుతూ, శ్రీ విరాట్ విశ్వకర్మ మహర్షిని సృష్టికర్తగా, శిల్పకళా నిపుణుడిగా, వాస్తుశాస్త్ర పితామహుడిగా గౌరవిస్తారని తెలిపారు. సృజనాత్మకత, శిల్ప నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, కష్టపడి పనిచేసే తత్వానికి విశ్వకర్మ మహర్షి ప్రతీకగా నిలుస్తారని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తి వృత్తి నిపుణులు, శిల్పులు, కార్మికులకు నిరంతరం మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు.  సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వృత్తిదారుల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతను వివరించారు.  అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూశ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా వృత్తి నైపుణ్యాలను గౌరవించడం, యువతలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, సంప్రదాయ వృత్తులను పరిరక్షించడం ద్వారా నైపుణ్యంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కార్యక్రమంలో పాల్గొన్న  విశ్వబ్రాహ్మ్బణ సంక్షేమ సంఘ ప్రతినిధులు ఆకాంక్షించారు. 2023 నుండి రాష్ట్ర ప్రభుత్వం శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుందని పెర్కోన్నారు. 




కార్యక్రమంలో  జిల్లా బీసీ సంక్షేమాధికారి రబ్బానీ భాష, విశ్వకర్మ నాయకులు రవి, సురేష్ ఆచారి, శివ కుమార్ ఆచారి , బిజెపి నాయకులు అట్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు






No comments:

Post a Comment