Wednesday, 9 September 2026

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడ కూల్చివేత

 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడ కూల్చివేత 

శరవేగంగా ఇరువారం రోడ్డు విస్తరణ పనులు 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 




చిత్తూరు నగరంలో ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో శరవేగంగా పలు ప్రాంతాలలో రోడ్ల విస్తరణ కార్యక్రమం జరుగుతున్న విషయం ఇదితమే. ఇందులో భాగంగా గతంలో జిల్లా కోర్టు ప్రహరీ గోడను కూల్చి రోడ్డు విస్తరణ చేపట్టారు. అనంతరం గంగినేని చెరువు ప్రహరీ గోడను ,  ఇరువారం వెళ్లే రహదారిలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడను కూల్చివేసి రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం చిత్తూరు నుండి ఇరువారానికి వెళ్లే పలమనేరు రోడ్డులో ఉన్న  ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాల్ లోపల కొంత మేరకు మార్కింగ్ చేసిన ప్రాంతాన్ని జెసిబి సాయంతో కూల్చివేత పనులు ప్రారంభించారు.  నగరం అభివృద్ధి చెందాలంటే తొలుత రోడ్లు రహదారులు అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో నగరపాలక అధికారులు ఇతర సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా తొలుత ప్రభుత్వ భవనాల ప్రహరీ గోడలను కూల్చివేసే  క్రమంలో  పలమనేరు రోడ్డులోని పశుసంవర్ధక శాఖ ప్రహరీ గోడను కూల్చివేసి నూతన ప్రహరీ గోడను కూడా నిర్మించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడను కూల్చివేశారు. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాల్ ను కూల్చివేసి త్వరలోనే పలమనేరు రోడ్డును మరింత వెడల్పుగా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పట్ల చిత్తూరు నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment