Wednesday, 30 September 2026

మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున, మొత్తం రూ. 40,000/- జరిమానా విధింపు...

మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున, మొత్తం రూ. 40,000/- జరిమానా విధింపు...



చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

జిల్లా ఎస్పీ  తుషార్  డూడి,  ఆదేశాల మేరకు, చిత్తూరు SDPO  వెంకట నారాయణ గారి ఆధ్వర్యంలో, చిత్తూరు ట్రాఫిక్   ఇన్స్పెక్టర్  P. నరసింహ రాజు నిర్వహించిన వాహన తనిఖీల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు.


వీరిని 30.09.2026వ తేదీ  చిత్తూరు  1st Spl. Judicial 2nd Class Magistrate, కోర్టులో ప్రవేశపెట్టగా, గౌరవ న్యాయమూర్తి శ్రీమతి K. పరిమళ దేవి  గారు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున, మొత్తం నలుగురికి  రూ.40,000/- జరిమానా విధించారు.


రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాటిని తప్పనిసరిగా పాటించకపోతే భారీ జరిమానాలు తప్పవని, మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమని, ఇది వాహనదారుల ప్రాణాలకు మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తుందని,   చిత్తూరు ట్రాఫిక్  ఇన్స్పెక్టర్   శ్రీ P. నరసింహ రాజు  గారు  హెచ్చరించారు. 


కాబట్టి వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు మరియు రహదారి నిబంధనలను పాటించి ప్రమాదాలు, జరిమానాలు, శిక్షలకు గురి కాకుండా జాగ్రత్తగా వాహనాలు నడపాలని  ఇన్స్పెక్టర్ శ్రీ P. నరసింహ రాజు గారు  కోరారు....

No comments:

Post a Comment