బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- CI కత్తి శ్రీనివాసులు
బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు సీఐ కత్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రౌడీ షీటర్ల ప్రవర్తన, గత కేసులు, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై అధికారులు వారికి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఇకపై ఎలాంటి నేరాలకు పాల్పడకుండా, సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. పోలీసుల నిఘా కొనసాగుతుందని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.
ప్రత్యేకంగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు, గొడవలు, బెదిరింపులు లేదా ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి కేసుల్లోనూ భాగస్వాములు కావద్దని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పోలీస్ శాఖ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రశాంత వాతావరణానికి సహకరించాలని రౌడీ షీటర్లకు సూచించారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

No comments:
Post a Comment