డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 5 మందికి భారీ జరిమానా
- ట్రాఫిక్ సిఐ నరసింహారాజు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
మద్యం సేవించి వాహనాలు నడిపిన 5 మందికి భారీ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ నరసింహారాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున 5 మందికి 50వేల రూపాయలు జరిమానాలను విధించామన్నారు. ఈనెల 7వ తేదీన చిత్తూరు మొదటి ప్రత్యేక జడ్జ్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి పరిమళాదేవి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున మొత్తం ఐదు మందికి 50వేల రూపాయలు జరిమానాలను విధించారన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలను పాటించకపోతే మద్యం సేవించి వాహనం నడిపితే లేదా రాష్ డ్రైవింగ్ లేదా నిర్లక్ష్యంగా వాహనం నడిపిన మైనర్లు వాహనం నడిపిన భారీ జరిమానా తప్పదని హెచ్చరించారు. ఒక్కొక్కసారి జరీమానా తో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని వెల్లడించారు. కాబట్టి ప్రతి ఒక్క వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవడం రోడ్డు నిబంధనలు పాటించడం ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.

No comments:
Post a Comment