Tuesday, 29 September 2026

పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) ఎన్నికలు – ప్రశాంత వాతావరణంలో నిర్వహణ

*పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) ఎన్నికలు – ప్రశాంత వాతావరణంలో నిర్వహణ*



చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

చిత్తూరు జిల్లా ఎస్పీ  తుషార్ డూడి, ఆదేశాల మేరకు, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో నిర్వహిస్తున్న స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిల్లా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.

జిల్లా వ్యాప్తంగా SMC ఎన్నికలు జరుగుతున్న పాఠశాలల్లో సున్నితమైన మరియు సమస్యాత్మకంగా గుర్తించిన పాఠశాలలను పోలీసులు ముందుగానే సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఎన్నికల నిబంధనలు, పాటించాల్సిన విధివిధానాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు.

ఎన్నికల సమయంలో పాఠశాలల పరిసర ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండి, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు భద్రతా చర్యలు చేపట్టి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకున్నారు.

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా SMC ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించారు.

No comments:

Post a Comment