చిత్తూరు సుభిక్షంగా ఉండాలని.. "శ్రీనివాస కళ్యాణం"
- ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
చిత్తూరు ప్రజలు సుభిక్షంగా ఉండాలని.. ఎన్ లినో ప్రభావం తగ్గి.. వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థిస్తూ.. శనివారం సాయంత్రం చిత్తూరు మెసానిక్ మైదానంలో "శ్రీనివాస కల్యాణం" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. శ్రీనివాస కల్యాణం, యజ్ఞం కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి మెసానిక్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం ఎమ్మెల్యే పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాలు సంమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ.. పీఠాధిపతులు, గురువులు, వేద పండితులతో యజ్ఞం, శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి ప్రజలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు.

No comments:
Post a Comment