చిత్తూరు కార్పొరేషన్ మేయర్ స్థానానికి సీపీఐ పోటీ
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
ఏ. రామానాయుడు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
చిత్తూరు నగరంలో సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర సమితి సమావేశం పార్టీ కార్యాలయంలో ఎం.విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశ ప్రాధాన్యతను అజెండాను సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి యస్.నాగరాజు నగర సిపిఐ నాయకులకు వివరించారు
రానున్న చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానానికి సీపీఐ పోటీ చేయాలని నగర సమితి ఏకగ్రీవంగా తీర్మానించిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ A. రామానాయుడు తెలిపారు. నగర పార్టీ కార్యాలయంలో సీపీఐ నగర సమితి సమావేశం నగర కార్యవర్గ సభ్యులు విజయకుమార్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని 60 డివిజన్లలో ప్రజాస్వామ్య, వామపక్ష, లౌకిక పార్టీలతో పాటు కలిసి వచ్చే ప్రజా సంఘాలు, వ్యక్తులతో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తామని తెలిపారు.
కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో మురికివాడలు, డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల సమస్యలు కొనసాగుతున్నాయని అన్నారు. నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు.
ప్రజా సమస్యలపై సీపీఐ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల పక్షాన నిలుస్తోందని, చిత్తూరు నగర సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు వెళ్తామని రామానాయుడు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు సీపీఐని ఆదరించి బలపరచాలని ఆయన కోరారు.
సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.నాగరాజు, సహాయ కార్యదర్శి కె.శివారెడ్డి, నగర కార్యదర్శి వి.సి. గోపీనాథ్, నగర కార్యవర్గ సభ్యులు కే.మణి, విజయ గౌరీ, బాలాజీ, కుమారి, సత్యమూర్తి, జమీలాబీ, కోమల, పి. గజేంద్ర బాబు, మహేష్, గోవిందస్వామి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment