రోడ్డు వైపు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బొలెరో
అక్కడికక్కడే ఇద్దరు మృతి
ముగ్గురికి తీవ్ర గాయాలు
కేసు నమోదు - బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
రోడ్డు వైపు ఆగి ఉన్న లారీని వెనకనుండి అతి వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది. బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు కథనం మేరకు క్రిష్ణగిరి తాలూకా కుప్పచ్చి పారైకి చెందిన 6 మంది ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు బొలెరో వాహనంలో బుధవారం బయలుదేరి తిరుమల కు వెళ్లి గురువారం తెల్లవారి జామున దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో మొగిలి ఘాట్ రోడ్డు లోని ఏకాంబరం దాబా వద్ద బొలెరో వాహనాన్ని నడుపుతున్న పాండియన్ (65) నిద్రమత్తులో అతి వేగంగా వెళ్లి రోడ్డు వైపు గేర్ బాక్స్ మరమ్మత్తు చేస్తూ ఆగి ఉన్న లారీని వెనకవైపు ఢీకొట్టడంతో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న కాంచన అనే మహిళ అక్కడికక్కడే మరణించగా, ఉమాపతి రాజా అనే వ్యక్తిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. గణపతి ,పాండియన్, నిత్య అనే ముగ్గురికి రక్త గాయాలైనట్లు తెలిపారు. ఈ ఘటన పైన గణపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.



No comments:
Post a Comment