*SIR–2026పై జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్*
*సెప్టెంబర్ 21, 22 నాటికి పెండింగ్ కేసులు, విచారణలు పూర్తి చేయాలి*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ వివేక్ యాదవ్*
*చిత్తూరు జిల్లాలో SIR–2026 ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి*
జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్
చిత్తూరు, సెప్టెంబర్ 17 ఫస్ట్ న్యూస్ 4 యు:
ప్రత్యేక విస్తృత పునర్విమర్శ (SIR–2026) కార్యక్రమం అమలుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ వివేక్ యాదవ్ గురువారం సచివాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా SIR–2026లో భాగంగా కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా పునర్విమర్శ, క్షేత్రస్థాయిలో చేపడుతున్న పరిశీలన, నోటీసులు, దరఖాస్తుల పరిష్కారం, విచారణలు తదితర అంశాలపై జిల్లా వారీగా పురోగతిని సమీక్షించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జాయింట్ కలెక్టర్, ఆదర్శ రాజేంద్రన్, రెవెన్యూ అధికారి, మోహన్ కుమార్ అదికాదులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ SIR–2026 కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిర్దేశిత కాలపరిమితికి అనుగుణంగా సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసులు, దరఖాస్తులు, విచారణలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, ఓటర్ల జాబితా పునర్విమర్శ ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల సిబ్బందికి అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అందిస్తూ ప్రక్రియ సజావుగా జరిగేలా జిల్లా ఎన్నికల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో చిత్తూరు జిల్లాలో SIR–2026కు సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన ప్రక్రియ పురోగతిని జిల్లా జాయింట్ ఆదర్శ రాజేంద్రన్ వివరించారు. జిల్లాలో ఓటర్ల జాబితా పునర్విమర్శకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులు, దరఖాస్తులు, విచారణలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నోటీసుల జారీ, దరఖాస్తుల పరిశీలన, ఆమోదం, తిరస్కరణ, ఫీల్డ్ వెరిఫికేషన్ తదితర ప్రక్రియలను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఫారమ్–6, ఫారమ్–7, ఫారమ్–8లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తిరస్కరణలకు సంబంధించి ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment