Sunday, 20 September 2026

యూ.పి.ఏ లావాదేవీ లపై చార్జీలను విరమించుకోవాలి -సిపిఐ డిమాండ్

 యూ.పి.ఏ లావాదేవీ లపై చార్జీలను విరమించుకోవాలి 

-సిపిఐ డిమాండ్


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:

కేంద్ర ప్రభుత్వం సామాన్య,మధ్యతరగతి ప్రజల పైన అధిక భారాన్ని  మోపి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు, వాణిజ్య గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు, కూరగాయల  ధరలను నియంత్రించకపోవడంతో ఇప్పటికే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులకు గురి అవుతుంటేకేంద్రంలోని మోడీ ప్రభుత్వం యూపీఏ పేరుతో లావాదేవీల పేరుతో విధించిన చార్జీలతో  చిరు వ్యాపారస్తులు, పేద, మధ్యతరగతి ప్రజలపై అధిక భారాన్ని మోపి ఇబ్బందులకు గురి చేయడం దుర్మార్గమన్నారు, తక్షణమే యూపీఐ చార్జింగ్ విరమించుకోవాలని లావాదేవీ పై చార్జీలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికే జీఎస్టీ పేరుతో నిత్యవసర ధరలు వినియోగదారులపై భారం పడుతున్నదని వాపోయారు యూపీఏ  లావాదేవీల చార్జీలపై వినియోగదారులపై ఏడాదికి సుమారు 20 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందని ఇందులో అత్యధిక భాగం అమెరికా కంపెనీలకు సామ్రాజ్యవాద దేశాల కంపెనీలకు పోతున్నదని దుయ్య బేట్టారు పేద మధ్యతరగతి పై అధిక భారం పడుతున్న యుపిఎస్ చార్జీలను వ్యతిరేకించాలని  కూటమి ప్రభుత్వంలోని  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్  కేంద్రంపై ఒత్తిడి చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది

No comments:

Post a Comment