Saturday, 19 September 2026

విద్యార్థులలో అభ్యసన సామర్ధ్యాన్ని పెంచాలి

విద్యార్థులలో అభ్యసన సామర్ధ్యాన్ని పెంచాలి 

- APC మద్దిపట్ల వెంకటరమణ 


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:

శనివారం  సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్,  పాలసముద్రం మండల స్పెషల్ ఆఫీసర్ మద్దిపట్ల వెంకటరమణ  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆముదాల పాలసముద్రం మండలం సి ఆర్ సి సమావేశాలకు హాజరైనారు ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి పాలసముద్రం హాజరైనారు . ఏపీ సి  సిఆర్సి సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులకు బోధనా మెలకువలు సూచించారు విద్యార్థులలో అభ్యసన స్థాయిలు పెంచాలని కోరారు. పాఠశాలలో విద్యార్థులకు విద్యను అందించడంతోపాటు వారికి కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలని సూచించారు పాఠశాలలో ఎస్ఎంసి ఎన్నికలు పారదర్శకంగా జరిగేటట్లు చూడాలని సూచించారు పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి భద్రత పట్ల శ్రద్ధ వహించే టట్లు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మెలగాలని సూచించారు తదుపరి మండల వనరుల కేంద్రం నూతన భవన నిర్మాణం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు మండల రెవెన్యూ కార్యాలయం నందు అధికారులతో సర్ పై సమీక్ష నిర్వహించారు

No comments:

Post a Comment