Tuesday, 8 September 2026

వెలగని వీధి దీపాలు.. అధికారుల నిర్లక్ష్య వైఖరి

 మూడు నెలలుగా వెలగని స్ట్రీట్ లైట్లు

అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆవేదన

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 



పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం:

ఎగువతడకరా పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో గత మూడు నెలలుగా స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు. దీంతో రాత్రి వేళల్లో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


స్ట్రీట్ లైట్లు పనిచేయడం లేదని గ్రామస్తులు పలుమార్లు గ్రామపంచాయతీ సెక్రటరీ పురుషోత్తంకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపిస్తున్నారు. అనంతరం సమస్యను ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లినా స్పందన కనిపించలేదని గ్రామస్తులు చెబుతున్నారు.


రాత్రి వేళల్లో చీకటి కారణంగా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, భద్రతపరంగానూ ఆందోళన నెలకొందని గ్రామస్తులు పేర్కొన్నారు.


ఇప్పటికైనా పై అధికారులు కలుగజేసుకొని ఎగువతడకరా పంచాయతీలో పనిచేయని స్ట్రీట్ లైట్లను వెంటనే మరమ్మతులు చేయించి, గ్రామంలో వెలుగులు నింపాలని గ్రామస్తులు కోరుతున్నారు.

No comments:

Post a Comment