రాష్ట్రంలో పెన్షన్ల పండుగ ప్రారంభం
మూడు లక్షల కొత్త పింఛన్లకు దరఖాస్తులు
నేటి నుండి దరఖాస్తుల స్వీకరణ
- టిడిపి మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా పెన్షన్ల పండగ ప్రారంభమైందని చిత్తూరు జిల్లా టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికీ 62 లక్షలు మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు అందిస్తుండగా మళ్లీ మూడు లక్షల కొత్త పెన్షన్ ఇవ్వడానికి దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 7వ తేదీ నుండి ప్రారంభమైందని అన్నారు.
ఇప్పటివరకు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా అత్యధికంగా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా పేరు పొందని అన్నారు. రాష్ట్రలో ప్రతినెల 2694 కోట్ల రూపాయలు సామాజిక పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 73,508 కోట్లు కేవలం పెన్షన్లకి అందించిన చరిత్ర కూటమి ప్రభుత్వంది అని అన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, మత్స్యకారులకు, డప్పు కళాకారులకు, చర్మకారులకు, కల్లుగీత కార్మికులకు ట్రాన్స్జెండ్ లకు పెన్షన్లు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అని కొనియాడారు. అన్ని వర్గాలు అండగా నిలుస్తున్న ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వడం అనేది ఒక తంతుగా కాకుండా ఒక బాధ్యతగా నిర్వహిస్తున్నారు అని అన్నారు. గ్రామ ప్రజలు అందరూ కూడా తమ తమ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అన్ని అర్హతలు ఉండి పెన్షన్ లేని వారు ఈ రాష్ట్రంలో ఉండకూడదని లక్ష్యంతో మంత్రి పని చేస్తున్నారు అని అన్నారు. రాష్ట్ర జనాభాలో 13 శాతం మందికి సామాజిక భద్రత పెన్షన్లు అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గణతకి ఎక్కిందని అన్నారు. ఈ యొక్క ప్రెస్మీట్లో టిడిపి కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ ,పూతలపట్టు నియోజకవర్గం తెలుగు యువత నాయకుడు వినోద్ కుమార్, తెలుగు రైతు కార్యదర్శి జైపాల్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment