తక్షణమే స్పందించి ఆర్థిక భరోసా కల్పించిన
- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నందు జిల్లాల నుండి వివిధ మండలాల నుంచి పలు సమస్యలతో ప్రజలు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతుల సమర్పించారు. వాటిలో కొన్నిటిని తక్షణమే స్పందించి ఆర్థిక సహాయం కొరకు ప్రతిపాదన సిద్ధం చేయాలి అని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు,
1)చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని మొరగారిపల్లి వద్ద నివసించుచున్న వరలక్ష్మి తన కుమారుడు రఘు బాబుకు 5సంవత్సరాలు వయస్సు మతి స్థిమితి లేదని .
నిరుపేదగా ఉన్నానని వైద్య పరీక్షల కొరకు ఆర్థిక సహాయం చేయవలసిందిగా PGRS కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతలు అందజేశారు
దీనిపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందిస్తూ, సంబంధిత అధికారులు ఫిర్యాదుదారుడి ధ్రువీకరణ పత్రాలు, అర్హత వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి 3 రోజుల్లోపు ఆర్థిక ఆర్థిక సహాయం అందజేయాలని, జిల్లా ప్రణాళిక అధికారి, మరియు డి ఆర్ డి ఎ పి డి ని ఆదేశించారు.

No comments:
Post a Comment