Thursday, 10 September 2026

లాజిస్టిక్స్ హబ్ గా అభివృద్ధి చెందనున్న చిత్తూరు పార్లమెంట్*

 *ఏపి-తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య వ్యూహాత్మక రైల్వే గేట్వేగా చిత్తూరు*

 *జిల్లా కేంద్రమైన చిత్తూరుకు చారిత్రాత్మక రైల్వే వరం*...

 *అరక్కోణం-రేణిగుంట 3వ & 4వ లైన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం*

*రద్దీ తగ్గింపు, రైళ్ల వేగం పెంపు, సమయపాలన మెరుగుదలే లక్ష్యం*

*లాజిస్టిక్స్ హబ్ గా అభివృద్ధి చెందనున్న చిత్తూరు పార్లమెంట్*

*లాభ పడనున్న రైతులు,పరిశ్రమలు*

 *అభివృద్ధి చెందనున్న పర్యాటక రంగం..,మెరుగవనున్న ఉపాధి అవకాశాలు*

*వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా  బలమైన అడుగు*.

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు వెల్లడి*

 *దేశ ప్రధాని, కేంద్ర రైల్వే శాఖ మంత్రి, ఏపీ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేసిన చిత్తురు పార్లమెంటు సభ్యులు*
 

----------------------------

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 

----------------------------




 ఆంధ్రప్రదేశ్ -తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య వ్యూహాత్మక రైల్వే గేట్వేగా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం రూపుదిద్దుకోనున్నదని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలియజేశారు.అరక్కోణం-

రేణిగుంట 3వ & 4వ లైన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇది జిల్లా కేంద్రమైన చిత్తూరుకు చారిత్రాత్మక రైల్వే వరమన్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా  బలమైన అడుగు పడిందని ఆయన తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో చిత్తూరును రాష్ట్రంలోనే అత్యంత ముఖ్యమైన గ్రోత్ కారిడార్ గా తీర్చిదిద్దుడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ స్పష్టం చేశారు.


దూర దృష్టితో  దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో అరక్కోణం-రేణిగుంట 3వ & 4వ లైన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా గురువారం చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు హర్షం వ్యక్తం చేశారు. 

అలాగే ఈ ప్రాజెక్టు ముఖ్యాంశాలను ఆయన వివరిస్తూ...

జాతీయ ప్రాజెక్టుల విస్తరణలో భాగంగా  దేశవ్యాప్తంగా 5 మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులను రూ 10,021 కోట్ల పెట్టుబడి, 540 కిలోమీటర్ల పొడవతో ఎన్డీఏ సర్కారు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా అరక్కోణం-రేణిగుంట 3వ & 4వ లైన్లకు శ్రీకారం చుట్టిందన్నారు.  77 కిలోమీటర్లు పొడవు, రూ. 1,936 కోట్ల అంచనావ్యయంతో దీన్ని ఏర్పాటు చేసేందుకు పూనుకుందన్నారు.


అరక్కోణం-రేణిగుంట 3వ & 4వ లైన్లు చిత్తూరు పార్లమెంటు పరిధిలోని నగరి నియోజకవర్గ పుత్తూరు గుండా రూపుదిద్దుకోనున్నాయన్నారు. వీటివల్ల రద్దీ తగ్గింపు, రైళ్ల వేగం పెంపు, సమయపాలన మెరుగుదలవుతుందని చిత్తూరు ఎంపీ చెప్పారు.


*చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి కలిగే ప్రత్యక్ష ప్రయోజనాలు*:


*1. ప్రయాణికులకు మెరుగైన సేవలు:*


చెన్నై - రేణిగుంట - తిరుపతి - చిత్తూరు మార్గంలో రద్దీ తగ్గి, కొత్త రైళ్లు నడపడానికి, ప్రస్తుత రైళ్ల సమయపాలన మెరుగుపడటానికి అవకాశం లభిస్తుంది.


*2. చిత్తూరు లాజిస్టిక్స్ హబ్ గా అభివృద్ధి:*


చిత్తూరు రెండు రాష్ట్రాల (AP & TN) మధ్య వ్యూహాత్మక గేట్‌వే. మెరుగైన రైల్వేతో ఇక్కడ పరిశ్రమలు, వేర్‌హౌస్‌లు, లాజిస్టిక్స్ పార్కులు, కోల్డ్ స్టోరేజీలకు పెట్టుబడులు వస్తాయి.


*3. రైతులు, పరిశ్రమలకు లాభం:*


చిత్తూరు మామిడి, టమాటా, పాల ఉత్పత్తులు, గ్రానైట్ పరిశ్రమలకు వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన సరుకు రవాణా సౌకర్యం కలుగుతుంది. మార్కెట్ అనుసంధానం పెరుగుతుంది.


*4. యాత్రా, పర్యాటక అభివృద్ధి:*

తిరుపతికి వచ్చే లక్షలాది మంది యాత్రికులకు చిత్తూరు మీదుగా ప్రయాణం సులభమవుతుంది. కాణిపాకం, హార్సిలీ హిల్స్ వంటి ప్రాంతాలకు పర్యాటకం పెరుగుతుంది.

*ఉపాధి మరియు ఆర్థికాభివృద్ధి:*- 


*నిర్మాణ దశలో*:

2-3 సంవత్సరాల పాటు వందలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి. స్థానికంగా కూలీలు, సాంకేతిక నిపుణులు, సిమెంట్, కంకర సరఫరా ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి.


 *దీర్ఘకాలికంగా:*

మెరుగైన కనెక్టివిటీ వల్ల కొత్త పరిశ్రమలు, లాజిస్టిక్స్, సర్వీస్ సెక్టార్ లో శాశ్వత ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.

అని చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి కలిగే ప్రత్యక్ష ప్రయోజనాలను చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరిపి ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలియజేశారాయన.

No comments:

Post a Comment