*చిత్తూరు–సిద్ధంపల్లి మధ్య రైల్వే లెవెల్ క్రాసింగ్ నెం. 27 వద్ద ట్రాఫిక్ మళ్లింపు రద్దు* : *జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్*
చిత్తూరు, ఫస్ట్ న్యూస్ 4 యు సెప్టెంబర్ 29:
చిత్తూరు–సిద్ధంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కి.మీ. 31/23-25 వద్ద (మొసానికల్ గ్రౌండ్ సమీపంలో) ఉన్న రైల్వే లెవెల్ క్రాసింగ్ నెం. 27 వద్ద చేపట్టాల్సిన ఓవర్హాలింగ్ పనుల కారణంగా రోడ్డు ట్రాఫిక్ మళ్లింపునకు సంబంధించి రైల్వే శాఖ అధికారులు మార్పులు చేసినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.
రైలు సర్వీసుల సమయపాలనను దృష్టిలో ఉంచుకుని రైల్వే ప్రధాన కార్యాలయం నుంచి అవసరమైన ఆమోదం లభించకపోవడంతో, ముందుగా 29.09.2026 నుంచి 01.09.2026 వరకు ప్రణాళిక చేసిన లెవెల్ క్రాసింగ్ నెం. 27 వద్ద రోడ్డు ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
అందువల్ల, లెవెల్ క్రాసింగ్ నెం. 27 వద్ద రోడ్డు ట్రాఫిక్ మళ్లింపుకు సంబంధించి గతంలో జారీ చేసిన సమాచారాన్ని ప్రస్తుతానికి రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.
రైల్వే శాఖ నుంచి తదుపరి సమాచారం లేదా సవరించిన షెడ్యూల్ అందిన అనంతరం ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు.

No comments:
Post a Comment