*ముఖ్యమంత్రి కుప్పం పర్యటన విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి*
*ఏఎస్ఎల్ (ముందస్తు భద్రత లైజాన్)లో భాగంగా పర్యటన ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి*
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
కుప్పం, సెప్టెంబర్ 20: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21వ తేదీ నుండి 22 తేదీ వరకు కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించనున్న నేపథ్యంలో, ఏఎస్ఎల్ (Advanced Security Liaison)లో భాగంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం నాయుడు, ముఖ్యమంత్రి పర్యటన లైసెన్ ఆఫీసర్ పి వెంకటేష్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, కుప్పం రైల్వే స్టేషన్ సూపర్డెంట్
తో కలిసి ఆదివారం పర్యటనకు సంబంధించిన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తుంసి ఎలిప్యాడ్
శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి చేరుకుంటారు. అక్కడ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ జలహారతి స్థలాన్ని పరిశీలించారు.
కుప్పం నియోజకవర్గంలో రైతు బజార్‌కు శంకుస్థాపన స్థలాన్ని పరిశీలించారు.
సహా కుప్పం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. రూ.289.5 కోట్ల విలువైన పనులు ప్రారంభించుకోవడంతో పాటు...రూ.38.5 కోట్ల విలువైన పనులకు సీఎం శంకుస్థాపనలు చేస్తారు. స్వర్ణ కుప్పం విజయాలను ప్రదర్శించే వీడియోను వీక్షిస్తారు. లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడతారు. కుప్పం కొత్తపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. “స్వర్ణ కుప్పం” అచీవ్మెంట్స్ గ్యాలరీని సందర్శిస్తారు. హిందాల్కో ప్రతినిధులతో సమావేశమవుతారు. జాతీయ రహదారి ప్రాజెక్టులపై సమీక్షిస్తారు. ఆరోజు రాత్రి... దాదర్–పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌కు కుప్పం రైల్వే స్టేషన్లో అదనపు హాల్ట్‌ను స్థలాన్ని పరిశీలించారు. కడపల్లి నందు ముఖ్యమంత్రి పాల్గొన్న కేడర్ మీటింగ్ సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా స్థలాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి జల హారతి నందు, బహిరంగ సభ నందు, ముఖ్యమంత్రి పాల్గొన్న ప్రదేశాలలో పటిష్టమైన భారీకేడ్లు, రైల్వే స్టేషన్ నందు భద్రత చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను అత్యున్నత ప్రమాణాలతో అమలు చేయడంతో పాటు ట్రాఫిక్ నిర్వహణ, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. భద్రతా విభాగం జారీ చేసే సూచనలను ప్రతి శాఖ తప్పనిసరిగా పాటించి సమన్వయంతో పనిచేయాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీకేఎం యూడీఏ చైర్మన్ సురేష్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, బెంగళూరు జోన్ కు సంబంధించిన రైల్వే అధికారులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment