Monday, 21 September 2026

ప్రతిభ కలిగిన క్రీడాకారులను వైసీపీ నాయకులు అవమానిస్తున్నారు.

ప్రతిభ కలిగిన క్రీడాకారులను వైసీపీ నాయకులు అవమానిస్తున్నారు.

* ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ 



చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

      సంవత్సరాల పాటు శ్రమించి, క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచి, డీఎస్సీలో ఉద్యోగం సంపాదించిన క్రీడాకారులను వైసీపీ నాయకులు అవమానిస్తున్నారని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ వ్యాఖ్యానించారు. సోమవారం శాప్ ఆఫీస్ వద్ద అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసేందుకు వచ్చిన స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై వైసీపీ నాయకులు దాడి చేయడం అత్యంత నీచమైన చర్య అని ఖండించారు. నిబంధనం ప్రకారమే క్రీడల్లో రాణించిన వారికి 3% ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో ఎలాంటి అక్రమాలకు తావు లేదని, వైసీపీ నాయకులు రాజకీయ స్వలాభం కోసం అనవసర రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. స్పోర్ట్ కోటాలో డీఎస్సీలో ఉద్యోగాలు వచ్చిన వారివి ఫేక్ సర్టిపీకేట్ లు అనడం క్రీడాలోకాన్ని నివ్వెర పరుస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే వైసీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలు సహించేది లేదని స్పష్టం చేశారు.


No comments:

Post a Comment