Sunday, 13 September 2026

కాణిపాకం చంద్రప్రభ వాహన ఉత్సవాన్ని విజయవంతం చేయండి

కాణిపాకం చంద్రప్రభ వాహన ఉత్సవాన్ని విజయవంతం చేయండి 

దేవాదాయ ధర్మాదాయ శాఖవిశ్రాంత జాయింట్ కమిషనర్ చంద్రప్రభ ఉభయ దారుడు జి కేశవులు

చిత్తూరు  ఫస్ట్ న్యూస్ 4 యు 




చంద్రప్రభ వాహన ఉత్సవాన్ని దళిత సోదరులు విజయవంతం చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖవిశ్రాంత జాయింట్ కమిషనర్ చంద్రప్రభ ఉభయ దారుడు జి కేశవులు విజ్ఞప్తి చేశారు ఆదివారం

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీ మరగదాంబిక మనకంటేశ్వర స్వామి ఆలయంలో వివిధగ్రామాలకు చెందిన దళిత ఉభయ దారులు చంద్ర ప్రభా వాహనం నిర్వహణపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు 


 ఈనెల 14 నుండి అక్టోబర్ 4 వరకు నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాల్లో చంద్రప్రభ వాహనాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని జి కేశవులు విజ్ఞప్తి చేశారు గతంలో 14 గ్రామాలు దళిత ఉభయదారులుగా చంద్రప్రభ వాహనాన్ని నిర్వహించే వారిని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువ నాయకుడు నారా లోకేష్ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ సహకారంతో మూడు గ్రామాలు కలుపుకొని 17 గ్రామాల దళితులు రెండు సంవత్సరాలుగా చంద్రప్రభ వాహనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ బ్రహ్మోత్సవాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అందరూ మాతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు

No comments:

Post a Comment