సెల్ఫోన్ మాట్లాడుతూ రైలు కిందపడి యువకుడు మృతి
- రైల్వే ఎస్సై వెంకట నరసింహo
సెల్ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటుతూ ఉండగా ఎదురుగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పైన రైల్వే ఎస్సై వెంకట నరసింహం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన కథనం మేరకు బుధవారం ఉదయం సుమారు 9.30 ల ప్రాంతంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ ఎస్ కొండ కుప్పమ్మ పల్లి గ్రామానికి చెందిన 22 ఏళ్ల వయస్సు కలిగిన మంజు అనే యువకుడు చిత్తూరు రూరల్ మండలం సిద్ధం పల్లి వద్ద ఉన్న చిన్న బండపల్లి రైల్వే ట్రాక్ పైన సెల్ఫోన్ మాట్లాడుతూ ట్రాక్ దాటేందుకు ప్రయత్నించగా ఎదురుగా వచ్చిన ట్రైన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఉదయం 11 గంటల ప్రాంతంలో రైల్వే ఎస్సై వెంకట నరసింహం తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేపు ఉదయం మృతదేహానికి పంచనామా నిర్వహించి అతని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఎస్సై వెంకటనారాయణ నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ రైల్వే ట్రాక్ వద్ద ఎవరు కూడా అనవసరంగా తిరగడం గాని ఇతర కాలక్షేపం పనులు చేయరాదని సూచించారు. రైల్వే ట్రాక్ పైన పని మీద వచ్చే వారు తప్పనిసరిగా అప్రమత్తత పాటించాలని సూచించారు.

No comments:
Post a Comment