Saturday, 12 September 2026

ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేయాలి

 ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలు చేయాలి:

 యుటిఎఫ్ డిమాండ్ 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 



  ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యు టి ఎఫ్ )చిత్తూరు జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు కె.రెడ్డప్ప నాయుడు అధ్యక్షతన 

ది.12 ఆగస్టు 2026,  శనివారం ఉదయం 10. 00 గంటలకు చిత్తూరు యుటిఎఫ్ కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది.

 ఈ సమావేశంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి 

జివి రమణ మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉపాధ్యాయ పదోన్నతుల విషయంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్న ఉమ్మడి సర్వీస్ రూల్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని,

 ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు హెల్త్ కార్డ్స్ ద్వారా నగదు రహిత వైద్యచికిత్స లు సమగ్రంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. 

 జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే రెడ్డప్ప నాయుడు, ఎన్ మణి గండన్ లు మాట్లాడుతూ గత జనవరిలో ఇచ్చినటువంటి డిఏ బకాయిల్లో ఇంకనూ జమ కాని బకాయిలను, అదేవిధంగా సాంకేతిక కారణాలవల్ల రిజెక్ట్ అయిన బిల్లులను మరల సబ్మిట్ చేయడానికి అవకాశం కల్పించాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల స్పెషల్ 

 టెట్ ద్వారా ప్రత్యేక రాయితీ కొరకు ఎన్ సి టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రాతినిధ్యం చేయాలని, అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా నందు డిప్లయ్మేంట్ ద్వారా నియామకం కాబడిన ఉపాధ్యాయ జీతాలు చెల్లించాలని, జిల్లాల విభజన నేపథ్యంలో పదోన్నతులు చేపట్టి ఏర్పడే ఖాళీలు డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా సహాధ్యక్షులు ఎస్ రెహనా వేగం, 

డి.ఏకాంబరం, జిల్లా కార్యదర్సులు  బి ఈశ్వర మహేంద్ర పంటపల్లి సురేష్ ఎం పార్థసారథి, ఎం శ్రీనివాసులు, పి సి బాబు, కే వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment