బొమ్మసముద్రం- రామాపురం రైల్వే మార్గంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఆచూకీ తెలిసినవారు చిత్తూరు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వండి
- SI E.V.V.నరసింహం
రైలు నుండి ప్రమాదవశాత్తు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన పైన కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్సై EVV నరసింహం బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు.
ఆయన కథనం మేరకు బొమ్మసముద్రం రామాపురం మధ్య రైల్వే మార్గంలో ఈనెల 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గుర్తించామన్నారు. అతని మృతదేహం ఆధారంగా మూడు రోజుల క్రితం ప్రమాదవశాత్తు అటువైపుగా వెళ్తున్న రైలు నుండి కింద పడి మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు. అతని మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి తరలించామని ఈ వ్యక్తికి సంబంధించిన సమాచారం తెలిసిన వ్యక్తులు చిత్తూరు రైల్వే పోలీస్ లను సంప్రదించాలని కోరారు

No comments:
Post a Comment