Wednesday, 30 September 2026

మండల విద్యాశాఖ అధికారులకు సహిత విద్యపై ఒక్కరోజు అవగాహన కార్యక్రమం.

 మండల విద్యాశాఖ అధికారులకు సహిత విద్యపై ఒక్కరోజు అవగాహన కార్యక్రమం.


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

 సహిత విద్యపై మండల విద్యాశాఖ అధికారులకు ఒక్కరోజు అవగాహన కార్యక్రమం లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ  మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సహిత విద్యను బలోపేతం చేయాలని, జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు అందరూ 100%  PRASHAST APP  ను డౌన్లోడ్ చేసుకుని అందులో కార్యక్రమాలు పూర్తి చేయాలని తెలిపారు. తర్వాత  జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మద్ది పట్ల వెంకట్రమణ మాట్లాడుతూ జిల్లాలోని దివ్యాంగుల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని, నాలుగు రకాల  అలవెన్స్లు రూపంలో అందిస్తున్నామని, ఆటిజం పిల్లల కోసం జిల్లాలో ఐదు ఆటిజం  సెంటర్లను ప్రారంభిస్తున్నామని, అదేవిధంగా దివ్యాంగులకు సమగ్ర శిక్ష ద్వారా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తుందని వీటిని అందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. 




ఈ కార్యక్రమంలో డివైఈవోలు ఉమామహేశ్వర్, ఇందిరా, సహిత విద్య కోఆర్డినేటర్ మధు, DCEB సెక్రెటరీ హేమాద్రి,CDPO నిర్మల, అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ నుండి దుర్గాప్రసాద్, హేమ ప్రసాద్, హాస్పిటల్ నుండి జ్ఞాన శేఖర్, డిజేబుల్ డిపార్ట్మెంట్ నుండి రాజశేఖర్, సమగ్ర ఏఎస్ఓ నందకుమార్, సీఎమ్ఓ మధుసూదన్, 31 మండలాల మండల విద్యాశాఖ అధికారులు రిసోర్స్ పర్సన్ గా భార్గవ్ రామ్, నాగభూషణం పాల్గొన్నారు.

 ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయిలో పారా ఒలంపిక్స్ నందు పతకాలు  సాధించిన విద్యార్థులను సన్మానించడం జరిగింది వారికి ప్రోత్సాహంకంగా ₹1000 నగదు అందజేశారు.

No comments:

Post a Comment