సిఎన్ఆర్ విద్యాసంస్థల్లో ముందస్తు వినాయక చవితి వేడుకలు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
గుడిపాల మండల కేంద్రంలోని సిఎన్ఆర్ విద్యా సంస్థల్లో వినాయక చవితి ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధినేత డాక్టర్ లోకేష్ మాట్లాడుతూ హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించిన లేదా పూజలు, నోములు, వ్రతాలు చేసిన ఎటువంటి విజ్ఞాలు ,ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలిపూజను గణనాథునికి చేస్తారన్నారు. శివ,పార్వతుల తనయుని అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని భారతీయుల ప్రగాఢ నమ్మకం అన్నారు. పూజా కార్యక్రమంలో విఘ్నేశ్వరుని వివిధ పుష్పాలు, పత్రాలతో అలంకరించి పురోహితులచే వేదమంత్రాలతో పూజ చేశారు. వినాయక విగ్రహాన్ని పీఠంపై ఉంచి గంధం, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి కుడుములు, ఉండ్రాళ్ళు ,పండ్లతో వినాయకునికి నివేదించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి అర్జున్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment