Tuesday, 8 September 2026

జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన జడ్పీ చైర్మన్

 నా కారును చుట్టుముట్టిన టిడిపి శ్రేణులు 
దారి కాపుకాచి పిడిగుద్దులు గుద్దారు 
బైకులు కార్లతో వెంబడించారు 
భయభ్రాంతులకు గురి చేశారు 
-జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 




కుప్పం నియోజకవర్గంలో వైసిపి పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశంలో హాజరై తిరుగు ప్రయాణంలో శాంతిపురం మండలం నాయని పల్లి వద్ద సుమారు 200 మంది టిడిపి శ్రేణులు తన కారును అడ్డుకున్నారని జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ఆరోపించారు. మీడియాకు వీడియోను విడుదల చేస్తూ తనపై దాడికి దిగి పిడుగులు గుద్దారని, డ్రైవర్ చాకి చక్యంగా  కారును ముందుకు తీసుకు వెళ్తూ ఉండగా, వెనకాల 100 బైకులు కార్లలో తనను టిడిపి శ్రేణులు వెంబడించారని భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఎన్నికలవేళ ప్రత్యక్షంగా ఎదుర్కొనలేక ఇలా పరోక్షంగా టిడిపి శ్రేణులు తనపై దాడికి దిగడం భయభ్రాంతులకు గురి చేయడం ప్రజాస్వామ్య బద్దం కాదన్నారు. ఈ ఘటన పైన చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి నీ కలిసి ఫిర్యాదు చేశామన్నారు.

No comments:

Post a Comment