Saturday, 26 September 2026

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి

 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి

*సీపీఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయండి*

*సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజన్, సహాయ కార్యదర్శి   కె. శివారెడ్డి*



చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) చిత్తూరు నగర సమితి సమావేశం స్థానిక సీపీఐ కార్యాలయంలో నగర నాయకులు కామ్రేడ్ కే.మణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజన్, జిల్లా సహాయ కార్యదర్శి కె. శివారెడ్డి హాజరై మాట్లాడారు.

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు, ఓటు హక్కుకు రక్షణ కల్పించాల్సిన ఎన్నికల సంఘం తన బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. SIR ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా, ప్రతి అర్హుడైన పౌరుడి ఓటు హక్కును కాపాడాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైన రాజ్యాంగ హక్కు అని, ఎలాంటి కారణంతోనూ అర్హులైన పౌరులను ఓటు హక్కుకు దూరం చేయడం సరికాదన్నారు. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, తొలగింపులకు గురైన అర్హులైన ఓటర్లకు న్యాయం చేయాలని కోరారు. ఎన్నికల సంఘం పనితీరుపై ప్రజల్లో నెలకొన్న సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందన్నారు ఎన్నికల సంఘం కమిటీ లో సభ్యులు గా ఉన్నటువంటి ఇద్దరు అధికారులు సర్ లో ఉన్న అభ్యంతరాలును వ్యతిరేకించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. పంటలు ఎండిపోవడం, పెట్టుబడులు పెరగడం, దిగుబడులు తగ్గిపోవడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని కరువు పరిస్థితులను సమగ్రంగా అంచనా వేసి రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని, పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటించే అంశంపై కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

రాష్ట్ర ప్లీనరీలో ప్రజా సమస్యలపై చర్చ

రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ధరల పెరుగుదల, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై సీపీఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు నాయకులు తెలిపారు.

కడప మహానగరంలో నాలుగు రోజుల పాటు జరగనున్న సీపీఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాల్లో రాష్ట్ర రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా సమీక్షించి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై మరింత బలమైన ఉద్యమాలను చేపట్టేందుకు ప్లీనరీ సమావేశాలు దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు.


సీపీఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని, పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.


ఈ సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి వి.సి. గోపీనాథ్, నగర కార్యవర్గ సభ్యులు కే.మణి, దాసరి చంద్ర, విజయ్ కుమార్, విజయ్ గౌరీ, రమాదేవి, జమీలాభి, కుమారి, బాలాజీ రావు, కోమల, రఘు, ఫైరోజ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment