Saturday, 12 September 2026

రూ.8.60 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

రూ.8.60 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ 

- ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:



 ప్రజల వైద్య అవసరాలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు.  శనివారం ఎమ్మెల్యే ఆయన  స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 5 మందికి  సీఎం సహాయ నిధి నుండి రూ.8.60 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి  ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల వైద్య అవసరాల కోసం  సీఎం సహాయ నిధి ఏర్పాటు చేసిందని, పేదవారికి వైద్య అవసరాలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతి అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ రాజ్, అముద, పచ్చయప్ప, మేసక్ తదితరులు పాల్గొన్నారు.





No comments:

Post a Comment