Saturday, 19 September 2026

ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి..

 ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి..

* ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ 

* పీఎంఏవై 2.0 లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ



చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

ప్రజల కోసం మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు రానున్న స్థానిక ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాద్ రావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. శనివారం చిత్తూరు ఎమ్మెల్యే వారి కార్యాలయం ప్రజాదర్బార్ లో చిత్తూరు అర్బన్ పరిధిలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 ద్వారా ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని, మౌలిక సదుపాయాల కల్పన అందిస్తోందన్నారు. గతంలో ఎన్నడూ జరగనంతగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పీఎంఏవై కింద గత ఏడాది వెయ్యికి పైగా ఇళ్లకు మంజూరు చేయగా, ప్రస్తుతం 309 మందికి ఇల్లు మంజూరైనట్లు చెప్పారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1.0 లక్ష చొప్పున మొత్తం రూ.2.5 లక్షణం మంజూరు అవుతుందన్నారు. స్థానిక కూటమి పార్టీల నాయకులు మిగిలిన అర్హులైన వారిని గుర్తించి వారికి ఇల్లు మంజూరు అయ్యేలా జాబితా సిద్ధం చేయాలన్నారు. ప్రస్తుతం ఇల్లు మంజూరైన వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇల్లు నిర్మించుకునేలా అధికారులు వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు.  తెలుగుదేశం ప్రభుత్వం పేదల కోసమే పని చేస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు. కార్యక్రమంలో  చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, తెదేపా చిత్తూరు పరిశీలకులు కుమారి, కూటమి నాయకులు అట్లూరి శ్రీనివాసులు, రాజేష్ కుమార్ రెడ్డి, నళిని, క్లస్టర్, యూనిట్, డివిజన్, బూత్ ఇన్చార్జులు, తెదేపా, భాజాపా నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment