విజయవంతంగా ముగిసిన మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ సంబరాలు చిత్తూరు మరియు గుడిపాల మండలాలకు చెందిన విద్యార్థులు ఈ రోజు తపోవనం ఉన్నత పాఠశాలలో నిర్వహించడమైనది. ఈ కార్యక్రమములో 46 టీములు టీముకు ముగ్గురు విద్యార్థులు చొప్పున మొత్తం 138 విద్యార్థులు పాల్గొన్నారు. ఈ చెకుముకి సంబరాల్లో చిత్తూర్ అర్బన్ మండలంలో ప్రభుత్వ పాఠశాల విభాగంలో ఏపీ ఆర్ ఎస్ మైనారిటీ పాఠశాల, జడ్పీ హైస్కూల్ దొడ్డిపల్లి ప్రధమ ద్వితీయ స్థానాలు పొందాయి. ప్రైవేట్ పాఠశాల విభాగంలో బృందావన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల, క్యాంఫర్డ్ నార్త్ పాఠశాలలు ప్రథమ ద్వితీయ బహుమతులు సాధించారు. చిత్తూరు రూరల్ మండలంలో ప్రభుత్వ పాఠశాల విభాగంలో బిఎన్ఆర్ పేట జడ్పీ హైస్కూల్, తుమ్మిందా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ప్రైవేటు పాఠశాల విభాగంలో రెయిన్బో సీబీఎస్ఈ పాఠశాల, రెయిన్బో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రథమ ద్వితీయ స్థానాలు పొందారు.గుడిపాల మండలంలో జెడ్పీ హైస్కూల్ నరహరిపేట నుండి వచ్చిన రెండు టీములు ప్రధమ ద్వితీయ బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు హెచ్. అరుణ శివప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో పాఠశాల స్థాయిలో 20వేలకు పైగా విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారని ఈరోజు మండల స్థాయి చెకుముకి సంబరాలు 28 మండలాల్లో నిర్వహించామని, జిల్లాస్థాయి చెకుముకి సంబరాలు ఈనెల 27వ తేదీన చిత్తూర్ లో విజయం ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తామన్నారు. జనవిజ్ఞాన వేదిక నగర శాఖ అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ చెకుముకి సైన్స్ సంబరాల్లో ప్రశ్నాపత్రాలు వినూత్నంగా విద్యార్థుల్లో ఆలోచన శక్తిని రేకెత్తించే విధంగా ఉందని అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రాముఖ్యత సంపాదించినదని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు దండాల రాధాకృష్ణ మరియు వారి శ్రీమతి సరస్వతి గారి చేతులమీదుగా పదివేల రూపాయలు విలువ చేసే మెమెంటోస్ ను ప్రతి పాఠశాలకు బహుకరించారు. విశ్రాంత ఉపాధ్యాయులు జెడ్ ఎస్ ఎస్ కి చెందిన డాక్టర్ త్యాగరాజు నాయుడు పాల్గొన్న విద్యార్థులందరికీ 10,000 వెలువచేసే బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షురాలు జయంతి, గౌరవ అధ్యక్షులు మునిరత్నం, లైన్స్ క్లబ్ గోల్డ్ జోనల్ చైర్మన్ ఎం.వి శ్రీధర్ రెడ్డి, వీర రాఘవుల నాయుడు, తపోవనం హెడ్మాస్టర్ కుప్ప స్వామి పిళ్ళియి, అమర్నాధ రెడ్డి,రాజశేఖర్,రమేష్ పుష్ప, అమరనాధ్, తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment