*సైబర్ నేరాలపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ తుషార్ డూడి,
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
*చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాల నియంత్రణకు విస్తృత చర్యలు – బాధితులకు సకాలంలో సహాయం*
*సైబర్ నేర బాధితులకు చిత్తూరు పోలీసుల భరోసా — 16-09-2025 నుండి 15-09-2026 వరకు రూ.4.01 కోట్లకు పైగా నగదు హోల్డ్ చేసి, రూ.2.15 కోట్లకు పైగా బాధితులకు రీఫండ్.*
*సైబర్ మోసంలో నష్టపోయిన తర్వాత బాధపడటం కంటే... మోసానికి ముందే అప్రమత్తంగా ఉండటం మంచిది.*
*సైబర్ మోసంలో Golden Hour అత్యంత కీలకం… మోసం జరిగిన వెంటనే 1930కు కాల్ చేయండి.*
- *జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS*
చిత్తూరు జిల్లా పరిధిలో సైబర్ నేరాల నియంత్రణ, ప్రజల్లో అవగాహన కల్పించడం, సైబర్ మోసాల బారిన పడిన బాధితులకు సకాలంలో సహాయం అందించేందుకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు ఒక ప్రకటనలో తెలిపారు.
*16-09-2025 నుండి 15-09-2026 వరకు చిత్తూరు జిల్లా పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) ద్వారా మొత్తం 1,608 ఫిర్యాదులు నమోదయ్యాయి. పోలీసుల తక్షణ చర్యల ఫలితంగా సైబర్ మోసాలకు సంబంధించిన రూ.4,01,57,226/- నగదును హోల్డ్ చేయడం జరిగింది. అందులో ఇప్పటివరకు రూ.2,15,60,922/- నగదును బాధితులకు రీఫండ్ చేయడం జరిగింది.
ఈ సందర్బముగా జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు మాట్లాడుతూ... సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. అత్యాశ, భయం, అత్యవసర పరిస్థితి వంటి అంశాలను ఆసరాగా చేసుకుని బాధితుల నుంచి నగదు దోచుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా ఇటువంటి మోసాలను చాలా వరకు నివారించవచ్చు."
బ్యాంకు అధికారులు, పోలీసు అధికారులు, ప్రభుత్వ సంస్థల పేరుతో ఫోన్ చేసి OTP, PIN, CVV, ATM వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎవరైనా అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని జిల్లా ఎస్పీ గారు సూచించారు.
అలాగే, డిజిటల్ అరెస్ట్, KYC అప్డేట్, ఉద్యోగాలు, పెట్టుబడులు, రివార్డులు, లోన్లు, ట్రేడింగ్, ఆన్లైన్ గేమింగ్, ఫేక్ కస్టమర్ కేర్, సోషల్ మీడియా మోసాలు వంటి సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
సైబర్ మోసం జరిగిన వెంటనే Golden Hour అత్యంత కీలకం. మోసం జరిగిన తర్వాత తొలి గంటలోనే 1930కు సమాచారం అందించి, సంబంధిత బ్యాంకు లావాదేవీలను నిలిపివేయడానికి చర్యలు ప్రారంభించే అవకాశం ఉంటుంది. ప్రతి నిమిషం విలువైనదే కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు కాల్ చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. అలాగే www.cybercrime.gov.in (National Cyber Crime Reporting Portal) ద్వారా వెంటనే ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. మోసం జరిగిన తొలి గంటల్లోనే సమాచారం అందించడం ద్వారా మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.
*ప్రజలకు ముఖ్య సూచనలు*
🔹 ఎవరితోనూ *OTP, PIN, CVV, Password* వంటి రహస్య బ్యాంకింగ్ వివరాలను పంచుకోవద్దు.
🔹 తెలియని లింకులు, APK ఫైళ్లు, అనుమానాస్పద యాప్లను క్లిక్ చేయడం లేదా ఇన్స్టాల్ చేయడం చేయవద్దు.
🔹 వీడియో కాల్లో పోలీసు, CBI, ED, TRAI లేదా ఇతర ప్రభుత్వ అధికారులుగా పరిచయం చేసుకుని బెదిరించే వ్యక్తులను నమ్మవద్దు.
🔹 ఆన్లైన్ పెట్టుబడులు, ట్రేడింగ్, ఉద్యోగాలు, రివార్డుల పేరుతో వచ్చే ఆకర్షణీయమైన ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
🔹 సోషల్ మీడియా ఖాతాలకు బలమైన పాస్వర్డ్లు, Two-Factor Authentication వినియోగించాలి.
🔹 సైబర్ మోసం జరిగిన వెంటనే *1930*కు సమాచారం అందించాలి.
🔹 మోసానికి సంబంధించిన *ఫోన్ నంబర్లు, లింకులు, స్క్రీన్షాట్లు, బ్యాంక్ లావాదేవీ వివరాలు* వంటి ఆధారాలను భద్రపరచాలి.
*ప్రజలు అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని, ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతా నియమాలను పాటించి తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు సూచించారు.*

No comments:
Post a Comment