Wednesday, 9 September 2026

దివ్యాంగులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు

 దివ్యాంగులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు 
- కొణతల చంద్రశేఖర్ 
చిత్తూరు, ఫస్ట్ న్యూస్ 4 యు 



   దివ్యాంగులు నూతన పింఛన్ల దరఖాస్తులలో సాంకేతిక సమస్యలపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని వికలాంగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కొణతం చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చిత్తూరు కలెక్టరేట్ నందు మాట్లాడుతూ జిల్లాలో పలుచోట్ల గ్రామ వార్డు సచివాలయాల నందు అర్హులైన దివ్యాంగులు నూతన పింఛన్ల కొరకు దరఖాస్తు చేయు సమయంలో సదరం ఐడి నెంబర్ కు ఆధార్ నంబరు అనుసంధానం కానందున మిస్ మ్యాచ్ కారణంతో సాంకేతికపరమైన సమస్య తలెత్తుతున్నట్లు పలువురు దివ్యాంగులు ఆయన దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలిపారు. బాధిత దివ్యాంగులతో కలిసి నేడు కలెక్టరేట్ నందు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఐఏఎస్ గారిని  కలిసి సమస్యను వివరించినట్లు తెలిపారు. జెసి గారి ఆదేశాల మేరకు డిఆర్డిఏ పిడి శ్రీదేవి గారు సెర్ఫ్ అధికారులతో సమస్యపై ఫోన్లో సంభాషించారని తెలిపారు. రెండు రోజుల్లో సాంకేతికపరమైన సమస్యలన్నింటినీ పూర్తిస్థాయిలో పరిష్కరించనున్నట్లు డిఆర్డిఏ పిడి శ్రీదేవి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళి, ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు సుమతి, నాయకులు బాలాజీ నాయుడు, బాధిత వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment