Saturday, 19 September 2026

స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

*స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ  భాగస్వాములు కావాలి*.

*పరిసరాలు పరిశుభ్రతతో పాటు సమాజసేవే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ అడుగులు వెయ్యాలి*.

కలెక్టరేట్ ఏవో బ్యూల



చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు సెప్టెంబరు 19:

 జిల్లా కలెక్టరేటు  ప్రాంగణంలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో  భాగంగా కలెక్టరేట్ ఏవో బ్యూల సంయుక్తంగా అందరీ చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఏవో మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన విధానం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్యారీబ్యాగులు, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర   కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లాస్ధాయి నుంచి మండల, గ్రామ స్ధాయివరకు నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిలో మంచి అవగాహన కలుగుతుందని అన్నారు. క్యారీ బ్యాగులు, ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్, చెత్త వ్యర్ధాలను క్లాఫ్ మిత్రాలకు  అప్పగిస్తే వారు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పరిశుభ్రత చోటుచేసుకున్న ప్రాంతాల్లో అక్కడ ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తే ఆ ప్రదేశంలో చెత్తవేసేందుకు ఎవరికీ మనస్సు రాదన్నారు. రోజువారీ అవసరాలు కోసం ప్లాస్టిక్ కవర్ల స్థానంలో కాటన్, గన్ని బ్యాగులు వాడాలని కోరారు. ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేదించి, ఒక మంచి అలవాటుగా నేటినండి అమలుచేసి  మిగతా వారికి స్ఫూర్తిదాయంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది అన్ని సెక్షన్లో సూపర్డెంట్లు తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment