Friday, 25 September 2026

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం

 జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:


 తవణంపల్లి సెప్టెంబర్ 25 తవణం పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గల అన్ని స్కూళ్లలో ఈరోజు అనగా 25.09.2026 తారీకు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్య క్రమం జరిగింది ఈ కార్య క్రమములో మండల విద్యా శాఖ అధికారిణి హేమలత  మండల వైద్య అధికారి డాక్టర్ టి. ప్రియాంక , అదేవిధంగా అరగొండ బాల బాలికల పాఠశాల లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు  ఆధ్వర్యంలో అరగొండ గ్రామ రంజిత్ రెడ్డి , అరగొండ గ్రామ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సురేష్ బాబు  డాక్టర్ టి. ఎస్. మోహన వేలు   అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడ మైనది ఈ కార్యక్రమంలో మండలములో 19 సంవత్సరాల లోపు మొత్తము పిల్లలు  8233 మంది పిల్లలకు గాను 7696 మందికి అనగా 94% శాతము ఈరోజు ఆల్బెండజోల్ మాత్రలను పిల్లకు ఇవ్వడం జరిగిందని మిగిలిన వారికి అక్టోబర్ 5 వ తారీకున ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్య క్రమములో   సి హెచ్ ఓ జ్ఞాన శేఖర్ ఎంపీ హెచ్ ఓ సుబ్రమణ్యం పి హెచ్ ఎన్ జీవకళ  మరియు ఆరోగ్య పర్యవేక్షకులు రాజశేఖర్ , గోపి  మరియు ఆరోగ్య కార్య కర్త టి.సుబ్రమణ్యం అన్ని సచివాలయాల ఏఎన్ఎం లు, ఎం ఎల్ హెచ్ పి లు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

No comments:

Post a Comment