చిత్తూరు పట్టణంలోని లక్ష్మి వెల్ నెస్ స్పా పై ఆకస్మిక దాడులు – స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులు.
వ్యభిచార నిర్వహణపై కేసులు నమోదు – 5 మంది మహిళలు (షెల్టర్ హోంస్ కు తరలించారు), ఒక విటుడు, స్పా సెంటర్ యజమానిని మరియు మేనేజర్ ను అదుపులోకి తీసుకున్న చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ చిన్న పెదయ్య.
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా నందు వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్న నేపధ్యంలో ఈరోజు చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా, చిత్తూరు SDPO శ్రీ జె.వెంకటనారాయణ గారి పర్యవేక్షణలో చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ చిన్న పెద్దయ్య గారు మరియు సిబ్బందితో కలిసి పట్టణంలోని లక్ష్మి వెల్ నెస్ స్పా సెంటర్ పై ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి 5 మంది మహిళలను, (షెల్టర్ హోం కు తరలించారు), ఒక విటుడు, స్పా సెంటర్ యజమానిని మరియు మేనేజర్ ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ కార్యకలాపాలకు సహకరించిన సంబంధిత స్పా సెంటర్ యజమానులు, మేనేజర్లపై చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరిగిందని ఇన్స్పెక్టర్ గారు తెలియజేసారు.
ఈ సందర్భంగా 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలో వ్యభిచారం, మహిళల అక్రమ రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాడ్జీలు, హోటళ్లు, గెస్ట్ హౌస్ యాజమాన్యాలు తమ సంస్థల్లో జరుగుతున్న కార్యకలాపాలపై పూర్తి బాధ్యత వహించాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తే యజమానులు, నిర్వాహకులపైనా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేసారు.

No comments:
Post a Comment