Friday, 25 September 2026

142 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఘనంగా రిహార్సల్స్.

*142 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఘనంగా రిహార్సల్స్.*

*సెప్టెంబర్ 26న జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నందు ప్రధాన పాసింగ్ ఔట్ పరేడ్*


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 

చిత్తూరు పట్టణంలోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పరేడ్ మైదానంలో 2025 బ్యాచ్‌కు చెందిన 142 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు సంబంధించిన రిహార్సల్స్ ఈరోజు క్రమశిక్షణాయుత వాతావరణంలో నిర్వహించారు.142 మంది సెప్టెంబర్ 26న నిర్వహించనున్న ప్రధాన పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొననున్నారు. రిహార్సల్‌లో భాగంగా ట్రైనీ కానిస్టేబుళ్లు నిర్వహించిన కవాతు, మార్చ్‌పాస్ట్‌ను చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు పరిశీలించారు. ట్రైనీ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.



ప్రధాన పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా పాటించాల్సిన విధులు, పరేడ్ నిర్వహణ, సమన్వయం తదితర అంశాలపై సంబంధిత అధికారులకు మరియు ట్రైనీ కానిస్టేబుళ్లకు ఉన్నతాధికారులు సూచనలు చేశారు. సెప్టెంబర్ 26న జరగనున్న ప్రధాన పాసింగ్ ఔట్ పరేడ్‌కు గౌరవనీయులైన రవాణా, యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్, ఐఏఎస్ గారు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ మహబూబ్ బాష, ఏ.ఆర్. అడిషనల్ ఎస్పీ శ్రీ దేవదాస్, డి.టి.సి డి.ఎస్పీ శ్రీ జె.రాంబాబు, ఏ.ఆర్. డి.ఎస్పీ శ్రీ రామకృష్ణ, సీఐలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment